తెలంగాణలో మాదిరిగా ఏపిలో కూడా పవన్ కల్యాణ్ బిజెపికి మద్దతు గా ఉంటాడని బిజెపి నాయకురాలు పురందేశ్వరి అనుకున్నారని కాక పోతే ఏపిలో మాత్రం పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కలిసి పోరాటం చేస్తున్నారని లక్ష్మిపార్వతి తెలిపారు. ఏపి బిజెపికి అధ్యక్షురాలు గా ఆమె ఇక్కడకు వచ్చి బావ కు వంత పాడుతుందని ఆమె ఎద్దేవా చేశారు. ఏపిలో తెలుగుదేశం పార్టీని స్మాష్ చేసి తద్వార తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏదైతే కమ్మ సామాజికి వర్గం ఉందో దాన్ని బిజెపి వైపు తిప్పుుకోవాలని బిజేపి పన్నాగం అని ఆమె అన్నారు. మెత్తం మీద బిజెపి పార్టీకి ఆమె అధ్యక్షురాలు అయినా ఇక్కడ టిడిపి కి ఆమె బావ అయిన చంద్రబాబు మద్దతుగా నే ఆమె రాజకీయాలు చేస్తుందని లక్ష్మిపార్వతి అన్నారు.
లక్ష్మీపార్వతితో JAISWARAAJYA TV ఇంటర్వ్యూ వీడియోను కింద వీడియోలో చూడొచ్చు.