
Travelers Must Watch : వర్షాకాలం వచ్చిందే వానలు దండికొట్టడం కామన్. రైతులకు వర్షాలకు తీపికబురు పంచితే వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెడుతాయనే సంగతి తెల్సిందే. అత్యవసరం అయితే తప్ప వాహనాలతో వర్షం కాలంలో బయటికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. లేదంటే తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాలి. లేకుంటే మాత్రం ప్రాణాలకే ముప్పు రావచ్చు.
పై వీడియోలో ఓ కారులో పలువురు ప్రయాణిస్తున్నారు. అయితే కారు డ్రైవర్ మాత్రం ముందున్న కారును ఓవర్ టేక్ చేసి వరద నీటిలోకి దూసుకెళుతాడు. కొంతసేపు కారు వరద నీటిలోనే ఉంటుంది. అందులోని ప్రయాణీకులు హహకారాలు చేస్తారు. ఒకరిద్దరు వారిని రక్షించే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. మరోవైపు వరద ఉదృతి పెరగడంతో కారుతో సహా ప్రయాణీకులు నీటిలో కొట్టుకుపోతారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని దండేలిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.






