తెలంగాణ: ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ పేరు పోలీసులు FIR లో నమోదు చేశారు. షకిల్ కుమారుడు సోహెల్ దుబాయ్ పారిపోయినట్లు అందుకు పదిమంది సహకరించి నట్లు గుర్తించిన పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే సోహెల్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తనను అరెస్టు చేయొద్దు అంటూ కోర్ట్ ను ఆశ్రయించిన సోహెల్ దుబాయ్ నుంచి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దుబాయ్ పారిపోయెం దుకు సహక రించిన వారిలో ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరి కొంతమందికి కోసం గాలింపు చేపట్టిన పంజాగుట్ట పోలీసులు.