స్టార్ హీరోయిన్ సమంత షూటింగ్ లో గాయపడింది. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు తానే స్వయంగా వెల్లడించింది. తన రెండు చేతులకు అయిన గాయాలను చూపిస్తూ ఫోటోలను షేర్ చేసింది సోషల్ మీడియాలో. తాజాగా ఈ భామ ” సిటాడెల్ ” అనే వెబ్ సిరీస్ ని హిందీలో చేస్తోంది. ఆ వెబ్ సిరీస్ కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో గాయాల పాలయ్యింది.
దాంతో సమంత నటన పట్ల ఎంత సీరియస్ గా ఉందో , నటన అంటే తనకు ఎంత ప్రాణమో చెప్పకనే చెప్పింది ఈ సంఘటనతో . ఎందుకంటే …….. గత ఏడాది మాయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది సమంత. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే మెల్లి మెల్లిగా మనిషిని బలహీనం చేయడం. అయితే మనోనిబ్బరంతో తగిన వ్యాయామం చేస్తే మాత్రం త్వరగా కోలుకుంటారట.
సమంత అదేపని చేసింది. మనోధైర్యంతో తగిన వ్యాయామం చేస్తూ డాక్టర్ల సలహాలు , సూచనలు పాటిస్తూ తక్కువ సమయంలోనే కోలుకుంది. దాంతో సిటాడెల్ వెబ్ సిరిస్ షూటింగ్ లో పాల్గొంటోంది. అయితే యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడింది. గాయాలు పెద్దగా కాకపోయినా సమంత చేతులు మాత్రం బలహీనంగా కనబడుతున్నాయి. దాంతో బాధపడుతున్నారు నెటిజన్లు అలాగే సమంతకు ధైర్యాన్ని నూరి పోస్తున్నారు.