Home BREAKING Naga chaitanya-Samantha: నాగచైతన్యను వదలని సమంత.. శోభితను పెళ్లి చేసుకున్నాక కొత్తసమస్య

Naga chaitanya-Samantha: నాగచైతన్యను వదలని సమంత.. శోభితను పెళ్లి చేసుకున్నాక కొత్తసమస్య

38

Naga chaitanya-Samantha: చై-సామ్ విడాకుల తర్వాత మూడేళ్లకు నాగ చైతన్య శోభిత ధూళిపాలను సెకండ్ మ్యారేజ్ చేసుకునేందుకు రెడీ అయ్యాడు. దీనికి సంబంధించి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. పెళ్లికి ముందు చాలా సంవత్సరాలు సామ్ నాగ చైతన్య ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి జరిగిన తక్కువ సమయంలోనే విడిపోవడం బాధకలిగించే విషయమే.

సమంత (సామ్) తన నుంచి వెళ్లిపోయినా ఆ పేరు మాత్రం నాగ చైతన్యను వెంబడిస్తూనే ఉంది. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న శోభిత చెల్లెలిపేరు కూడా ‘సమంత’నే ఆమె పూర్తి పేరు ‘సమంత ధూళిపాల’. అక్కడ రూత్ ప్రభుకు ఇక్కడ ధూళిపాల యాడ్ అయ్యిందన్నమాట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చెల్ చేస్తుంది. చై గతం తనను వెంటాడుతుందనేందుకు ఈ పేరు గుర్తా.. అని పోస్టులు వైరల్ అవుతున్నాయి. శోభితతో కొత్త అధ్యాయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుండగా, సమంత పేరు చై పాత బంధాన్ని గుర్తు చేస్తుందని తెలుస్తోంది.

నిజంగానే చై అన్ని విధాలా ముందుకు వెళ్లగలడా లేక సమంత నీడ కనిపిస్తుందా? అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఊహించని ఈ అవరోధాన్ని చై డీల్ చేస్తుండగా సమంత పేరు ప్రస్తుత ప్రేమకథకు ట్విస్ట్ ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు సమంత ధూళిపాల ఫొటోలో భాగం కావడంతో, చై ఒక ఆసక్తికరమైన సవాలును ఎదుర్కొంటున్నాడు. అతను నిజంగా తన గతాన్ని విడిచిపెట్టగలడా, లేదా సమంత పేరు అతని జీవితాంతం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందా?