- ముక్కుకు సర్జరీ చేసిన డాక్టర్లు
- అర్థాంతరంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రమాదానికి గురయ్యాడు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో సినిమా షూటింగ్ జరుగుతుండగా షారూఖ్ ఖాన్ గాయపడ్డారు. ఈ సంఘటనలో ఆయన ముక్కుకు బలమైన దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. పక్కనే ఉన్నవారు వెంటనే గుర్తించిన ఆయనను ఆస్పత్రికి తరలించారు.
అయితే షారూఖ్ ఖాన్ ముక్కు నుంచి బ్లీడింగ్ ఎక్కువగా రావడంతో ముక్కుకు సర్జరీని నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షారుఖ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా సర్జరీ తర్వాత షారుఖ్ ముక్కుకు బ్యాండేజ్ తో కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆయన ముంబైలోని తన నివాసమైన మన్నత్ కు చేరుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు.