34.7 C
India
Friday, April 10, 2026
More

    పచ్చని కాపురంలో షేర్ మార్కెట్ చిచ్చు.. చిన్నారులతో సహా తల్లి సూసైడ్

    Date:

    Mother suicide
    Mother suicide including children (file)

    పచ్చని సంసారంలో షేర్ మార్కెట్ చిచ్చుపెట్టింది. షేర్ మార్కెట్ కు బానిసైన భర్త ఆస్తులు అమ్మడంతో పాటు అప్పులు కూడా చేశాడు. ఇక బాధలు భరించలేక భార్యను పుట్టింటి నుంచి కట్నంగా ఇచ్చిన ఆస్తిని తీసుకురమ్మని వేధించాడు. దీంతో ఇద్దరు పిల్లలతో సహా గృహిణి సూసైడ్ చేసుకుంది. ఈ కేసును సత్తుపల్లి సీఐ కరుణాకర్ విచరిస్తున్నారు. ఆయన గృహిణి పుట్టింటి తరుఫు వారు తెలిపిన వివరాల ప్రకారం..

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట నివాసి అడపా కృష్ణారావు కూతురు మృదుల (38)ని సత్తుపల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాటిబండ్ల ప్రశాంత్ తో 2009న వివాహం జరిపించారు. వివాహం అనంతరం దంపతులు అమెరికాకు వెళ్లారు. అక్కడ మూడేళ్లు ప్రశాంత్ ఉద్యోగం చేుస్తుండగా సంతోషంగా కలిసి ఉన్నారు. ఆ సమయంలోనే పెద్ద కొడుకు ప్రజ్ఞాన్ (7) పుట్టాడు. ఐదేండ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చిన ఆయన హయత్ నగర్ లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఐదేళ్ల కాలంలో చిన్న కుమారుడు మహాన్ (5) జన్మించాడు. అయితే పెద్ద కొడుకు 2వ తరగతి కాగా, చిన్న కొడుకు యూకేజీ చదువుతున్నారు.

    తన ఉద్యోగాన్ని చూసుకోక ప్రశాంత్ షేర్ మార్కెట్ లో చేరాడు. పెట్టు బడులు పెట్టడం, బెట్టింగ్ లు ఎక్కువయ్యాయి. దీంతో కొండాపూర్ లోని ఒక ఖాళీ స్థలాన్ని రూ. 65 లక్షలకు అమ్మి కొన్ని అప్పులు తీర్చాడు. ఈ నేపథ్యంలో భార్య తనకు కట్నం కింద ఇచ్చిన మూడున్నర ఎకరాల మామిడి తోటను కూడా అమ్మాలని సంవత్సరం నుంచి పట్టుబడుతున్నాడు. మృదుల తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పగా.. ఇప్పుడు వద్దని తర్వాత చూద్దామని వారు చెప్పారు. ఈ విషయంలో తరుచూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు ప్రశాంత్. దీంతో ఆమె తల్లిదండ్రులు భర్తను వదిలేయని చెప్పేవారు.

    భర్త వేధింపులు ఎక్కవవడంతో తోటను అమ్మాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం మృదుల తల్లిగారింటికి భర్తతో సహా వారం క్రితం వచ్చారు. దామెర సమీపంలోని ఒక ధ్యాన మందిరంలో తన పెద్దకొడుకు బర్త్ డే వేడుకలు నిర్వహించారు. విజయవాడలోని తన పెద్దమ్మ వద్దకు వెళ్లిన మృదుల ఆమెను పరామర్శించారు. తిరిగి సత్తుపల్లి చేరుకున్న మృదుల పెద్దమ్మకు ఫోన్ చేసి ‘తనకు భర్త వేధింపులు ఎక్కువయ్యాయని తాను చినిపోతున్నట్లు’ చెప్పింది. దామెర చెరువు వద్దకు వచ్చి పెద్ద కొడుకు కాలిని చున్నీతో కట్టి, చిన్న కొడుకును ఎత్తుకొని చెరువులోకి దిగి సూసైడ్ చేసుకుంది. తెల్లవారు జామున మూడు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన కూతురు మృతికి తన భర్త ప్రశాంత్ కారణం అంటూ ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular