వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్యాంక్ బండ్ పై మెరుపు ధర్నా చేసింది. దాంతో షాకైన పోలీసులు హుటాహుటిన ట్యాంక్ బండ్ కు చేరుకుని వైఎస్ షర్మిల ను అరెస్ట్ చేశారు. హఠాత్తుగా షర్మిల మెరుపు ధర్నా కు ఎందుకు దిగిందో తెలుసా ……. తన పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడమే.
ఇటీవల వరంగల్ జిల్లాలో షర్మిల పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున గొడవలు జరిగిన విషయం తెలిసిందే. దాంతో షర్మిల తీవ్ర పదజాలంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను అలాగే ఇతర ఎమ్మెల్యేలను దూషిస్తోందని వరంగల్ పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో కోర్టును ఆశ్రయించింది షర్మిల. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. అయితే షర్మిల ముఖ్యమంత్రి, మంత్రులు , ఎమ్మెల్యే లపై అనుచిత వ్యాఖ్యలు చేయనని హామీ ఇస్తేనే అనుమతి ఇస్తామని చెప్పడంతో ఇలా మెరుపు ధర్నాకు దిగింది షర్మిల. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది షర్మిల.