America అమెరికాలో బియ్యం కొరత ఏర్పడింది. దీంతో బియ్యం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మరోవైపు బియ్యం ఎగుమతులపై తాజాగా భారత్ సైతం నిషేధం విధించింది. ఈ న్యూస్ వైరల్ అయిన నేపథ్యంలో అమెరికాలో బియ్యం కోసం భారతీయులు ఎగబడుతున్నారు. అమెరికాలో బియ్యం అమ్మే మాల్స్ కు చేరుకొని వాటిని దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. వీటిని పరిశీలిస్తే అమెరిలో బియ్యం కొరత ఎంతలా భారతీయులను వేధిస్తుందో అర్థమవుతోంది. ఈనేపథ్యంలో అమెరికా సర్కారు బియ్యాన్ని ఎక్కువ మొత్తంలో దిగుమతులు చేసుకునేందుకు సిద్ధమవుతోందని సమాచారం.