
అస్సాంలో సంచలనం సృష్టించిన లేడీ పోలీస్ ఆఫీసర్ మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించగా, కాదు ఇది హత్య అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . ప్రత్యక్ష సాక్షుల కథనాలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి
అస్సాంలో లేడీ సింగంగా జున్మని రాబాకు పేరుంది. కాబోయే భర్తనే అవినీతి కేసులో అరెస్ట్ చేయించి, దేశవ్యాప్తంగా ఆమె పేరు వినిపించింది. ఎందరో ఆమెను పొగుడుతూ ట్రోల్స్ చేశారు కూడా. అయితే ఆమె రెండు రోజుల క్రితం అతి దారుణంగామృతి చెందారు. ఒక్క ట్రక్కు ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. అయితే దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి ఆమెను చంపాకే కారులో వేసి ట్రక్కుతో ఢీకొట్టారని ఆరోపణలు బయటకు వచ్చాయి. ఇందుకు ఒక కానిస్టేబుల్ సందేశం, మరో ప్రత్యక్ష సాక్షి కథనాలు బయటకు వచ్చాయి. ఆ కారులో నుంచి ఇద్దరు దిగడం చూశామని ప్రత్యక్షి తెలపడం, ఈ హత్యారోపణలకు బలం చేకూరుస్తున్నాయి. అయితే పోస్టు మార్టం రిపోర్టులో కూడా ఇందుకు బలంగా రిపోర్టు రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమయ్యింది. పోలీస్ శాఖలో ని కొందరు అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దీనిపై సమగ్ర విచారణను సీబీఐకి అప్పగించాలని డీజీపీ నిర్ణయించారు. ఇందుకోసం ప్రతిపాదిస్తూ రాష్ర్ట ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతకుముందు ఆయన రాష్ర్టంలోని కీలక అధికారులతో సమావేశమయ్యారు. పోస్టుమార్టం రిపోర్టులో ముందస్తు పథకం ప్రకారమే ఆమెను చంపినట్లు అనుమానాలు రావడంతో, ఈ అంశంపై చర్చించారు. సీబీఐకి ఈ కేసును అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక పోలీస్ అధికారి మృతిపై సీబీఐ విచారణను కోరుతూ రాష్ర్టడీజీపీనే నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.