Singer Mangli injured : సింగర్ మంగ్లీ.. ఈమె పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.. అంతగా ఈమె తన పాటలతో అందరిని అలరించింది.. ఒకప్పుడు మంగ్లీ అంటే ఎవరో కూడా ఆడియెన్స్ కు తెలియదు.. అలంటి స్థాయి నుండి ఇప్పుడు స్టార్ సింగర్ గా ఎదిగింది.. మరి అలాంటి సింగర్ తాజాగా గాయాల పాలు అయ్యిందని తెలుస్తుంది. ఇంతకీ ఈమెకు గాయం అవ్వడానికి కారణం ఏంటి? ఎలా జరిగింది ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సింగర్ మంగ్లీ తాజాగా ఒక ప్రైవేట్ సాంగ్ షూట్ చేస్తుందట. ఈ క్రమంలోనే ఈమెకు గాయం అయ్యింది అని తెలుస్తుంది. ఇప్పుడు బోనాల సమయం కావడంతో ఈమె ప్రైవేట్ సాంగ్ షూట్ జరుగుతుందని ఈ షూట్ చేస్తున్న సమయంలోనే ఈమెకు కాలికి గాయం అయినట్టు తెలుస్తుంది. షూట్ చిత్రీకరణలో భాగంగా కాలుజారి పడిపోయినట్టు న్యూస్ బయటకు వచ్చింది.
ఈమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేసి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తుంది. యాంకర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ భామ ఆ తర్వాత జానపద గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా తన హవా చూపిస్తూ స్టార్ సింగర్ గా ఎదుగుతుంది. తన గాత్రం లోని మాధుర్యాన్ని అందరికి పరిచయం చేస్తూ అందరిని తన పాటల ప్రమహంలో కొట్టుకుపోయేలా చేస్తుంది.
తక్కువ సమయంలోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ ఇప్పటి వరకు 100కు పైగానే సినిమాల్లో పాడింది.. సినిమా సాంగ్స్ తో పాటు పండుగల సమయంలో ఆ పండుగ ప్రత్యేకతను తెలిపే ఒక ప్రైవేట్ పాట ఆ పాటకు వీడియో సాంగ్ తో షూట్ చేసి రిలీజ్ చేయడం అలవాటు.. అందుకే ఈమె సాంగ్ కోసం ఆడియెన్స్ కూడా ప్రతీ పండుగకు ఎదురు చూస్తారు.. ఈసారి కూడా బోనాలకు సాంగ్ షూట్ చేస్తుండగా ఈ ఘటన జరగడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.