23 C
India
Wednesday, August 12, 2026
More

    Actress Jayaprada : సీనినటి.. మాజీ ఎంపీ జయప్రదకు షాకిచ్చిన చైన్నై కోర్టు..!

    Date:

    Actress Jayaprada
    Actress Jayaprada

    Actress Jayaprada : సినీ నటి.. మాజీ ఎంపీ జయప్రదకు చైన్నైలోని ఎగ్మోర్ కోర్టు షాకిచ్చింది. ఓ కేసులో జయప్రదతోపాటు ముగ్గురిని దోషిగా తేల్చింది. ఆరు నెలల జైలు శిక్షతోపాటు ముగ్గురికి రూ.5వేల జరిమానాను విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది.

    ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఓ టాకీస్ ఉంది. దీనిని ఆ ప్రాంతానికి చెందిన రామ్ కుమార్.. రాజబాబుతోపాటు జయప్రద నిర్వహించేవారు. ఈ సినిమా టాకీస్ ప్రారంభంలో బాగానే నడిచింది. ఆ తర్వాతి కాలంలో నష్టాల్లో కూరుకుపోవడంతో బంద్ చేశారు.

    అయితే ఈ టాకీసులో పనిచేసిన కార్మికుల నుంచి ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు యాజమాన్యం చెల్లించలేదు. దీంతో కార్మికులతోపాటు కార్పొరేషన్ ఎగ్మూరు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సమయంలో యాజమాన్యం కార్మికులకు చెల్లించాల్సిన మొత్తాన్ని బయట సెటిల్ చేసుకుంటామని జయప్రద తరఫు లాయర్ కోర్టుకు గతంలో విన్నించారు.

    అయితే దీనిని కోర్టు తోసిపుచ్చింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాయర్ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుని కేసును విచారించింది. సుదీర్ఘ విచారణ అనంతరం నేడు తీర్పు వెలువరించింది. ఈ కేసులో జయప్రదతోపాటు ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష.. ఒక్కొక్కరికీ ఐదు వేల రూపాయాల జరిమానాను విధిస్తూ తీర్పును ఇచ్చింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Jayaprada : జయప్రదకు బలవంతంగా ముద్దుపెట్టాడు.. ఆ నటుడు ఎవరంటే?

    Actress Jayaprada : టాలీవుడ్ నుంచి బాలివుడ్ వెళ్లి సక్సెస్ అయిన...