తెలంగాణ: బాలింతల ఆరోగ్యం లక్ష్యంగా తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ కోసం ప్రత్యేక కార్యక్ర మాన్ని ప్రారంభిస్తోంది. ప్రసవానంతర ఇన్ఫెక్షన్లు, కాళ్ల వాపు, నొప్పులు, మానసిక సమస్యలు పరిష్కరించాలని దీని అమలు చేయనున్నారు.
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. మహిళలను ఏడాది పా లటు పర్యవేక్షించి అవసరమైన వైద్యాన్ని అందిస్తారు. జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా గర్భిణీల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిం చేందుకు కసరత్తు ప్రారంభించింది. గర్భిణీలకు అందుతున్న పౌష్టికాహారం, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది.