
Sr. NTR Vardhanthi : ఎన్టీఆర్ సర్కిల్ లో వున్న ఎన్టీఆర్ విగ్రహంకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురధేశ్వరి, బీజేపీ రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారి 29 వ వర్ధంతి. మరణం లేని జననం ఆయనది అన్నారు. ఏ రంగంలో వున్న ఆ రంగానికి వన్నె తెచ్చరని.. చలన చిత్రం లో కేవలం రంగులు వేసే వారీగా మాత్రమే గుర్తింపు వుండేది.. కానీ ఎన్టీఆర్ గారు సినీ రంగంలోకి అడుగు పెట్టిన తరువాత సినీ చరిత్రకి కొత్త గుర్తింపు తెచ్చారన్నారు.
అలానే రాజకీయాల్లో కూడా తన కంటూ కొత్త చరిత్ర రాశారని పురేంధేశ్వరి అన్నారు. మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. పేదల కోసం రెండు రూపాయల కి కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మాండలిక వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు, ఆంధ్రుల ఆత్మ గౌరవం తీసుకువచ్చారు జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలి అని కోరుకుంటున్నాను’ అని పురంధేశ్వరి అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం, బిజెపి నేతలు కిలారు దిలీప్, భోగవల్లి శ్రీ ధర్,కోలపల్లి గణేష్,మాదల రమేష్,పోతం శెట్టి నాగేశ్వరరావు,బుల్లబ్బాయ్, పట్నాయక్, సునీత, సుమతి తదిరులు పాల్గొన్నారు.