చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరు పర్యటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చంద్రబాబు రోడ్డు షోకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. చంద్రబాబు నాయుడును చూడటానికి ఉత్సాహపడ్డారు. దాంతో అత్యుత్సాహం కాస్త ముదరడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిలాసటలో ఏడుగురు మరణించారు. మరో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
తొక్కిసలాట జరుగుతుంది జాగ్రత్త ….. మీ ఉత్సాహం తగ్గించండి అంటూ పదేపదే చంద్రబాబు హెచ్చరించిన సమయంలోనే ఈ దారుణం జరిగింది. దాంతో చంద్రబాబు చలించిపోయారు. వెంటనే రోడ్ షోను రద్దు చేసుకొని క్షతగాత్రులను పరామర్శించారు. అలాగే చనిపోయిన వాళ్ళ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చనిపోయిన వాళ్లకు ఒక్కొక్కరికి 10 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించారు. కందుకూరు రోడ్ షో విషాదాన్ని మిగల్చడంతో టీడీపీ శ్రేణులు షాక్ కు గురయ్యారు.