32.7 C
India
Monday, February 26, 2024
More

    Strong Hair- Curry Oil : కరివేపాకు నూనెతో బలమైన జుట్టు… మీ సొంతం… తయారీ ఇలా..

    Date:

     

    కరివేపాకులో ప్రొటీన్లు, బీటా కెరోటిన్ ఉంటాయి. ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు దొరుకుతాయి. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. కరివేపాకును వాడటం వల్ల స్కాల్ప్ తేమగా ఉండి జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది. కరివేపాకులోని విటమిన్ బి జుట్టు అకాలంగా నెరసి పోవడాన్ని తగ్గిస్తుంది. జుట్టుకు పోషణ, అసలు రంగును పునరుద్ధరించడంలో ఇది సహాయపడు తుం ది. కరివేపాకులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శిరోజాలను ఆరోగ్యం గా ఉంచుతాయి. చుండ్రు, ఇన్ఫెక్షన్ల నుండి స్కాల్ప్ ను రక్షిస్తాయి. అయితే కరివేపాకు నూనెను తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం.

    కరివేపాకును నీటిలో బాగా కడిగి శుభ్రం చేయాలి. తర్వాత ఆకులను గాలిలో ఆరబెట్టాలి. తడి లేకుండా చూసుకోవాలి. ఒక పాన్‌ పొయ్యి మీద పెట్టి.. మీడియం మంట పెట్టాలి. అందులో కొబ్బరి నూనెను వేడి చేయాలి. నూనె కాస్త వేడి అయ్యాక అందులో కరివేపాకు వేసుకోవాలి. తక్కువ మంట మీద సుమారు 10 నుంచి 15 నిమిషాలు మరిగించాలి. ఈ సమయంలో నూనెను తరచుగా కలపాలి. కొబ్బరి నూనెలో కరివేపాకు ఆకులు బాగా కరిగే వరకు మరిగించాలి. తర్వాత మంట ఆపి చల్లారనివ్వాలి. ఈ కరివేపాకు నూనెను ఒక సీసాలో వడకట్టాలి. కొబ్బరి నూనెకు బదులుగా ఆలివ్ నూనె లేదా బాదం నూనెను కూడా వాడుకోవచ్చు.

    తర్వాత కరివేపాకు నూనెను జుట్టు మూలల నుంచి చివర్లదాకా రాయాలి. కాసేపు తలకు మసాజ్ చేయండి. నూనె రాసి మరో గంట సేపు అలాగే ఉంచాలి. షాంపూతో మీ తలను కడగాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ నూనె వాడితే వెంటనే ఫలితం ఉంటుంది. కరివేపాకు నూనె జుట్టుకు పోషణను ఇస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మూలాలను బలపరుస్తుంది. వేగంగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇలా కరివేపాకు నూనెతో జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

    Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

    Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

    Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

    Arranged Marriage : అరెంజ్డ్ మ్యారేజ్ కు ఓకే చెప్పే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి!

    Arranged Marriage : ప్రతీ  ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది పెద్ద...

    Husband Wife Relationship : భార్యకు ఏ విషయం చెప్పాలి..? ఏ విషయం దాచాలి..?

    Husband Wife Relationship : అన్ని బంధాల్లో గొప్పది భార్యాభర్తల బంధం....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related