27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Sudden Floods : ఆకస్మిక వరదలు.. లద్దాఖ్ లో ఐదుగురు జవాన్ల మృతి

    Date:

    Ladakh
    Ladakh

    Sudden Floods : చైనా సరిహద్దు లద్దాఖ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా-చుషుల్ ప్రాంతంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. లేహ్ కు 148 కి.మీ. దూరంలోని బోధి నదిలో శనివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

    సైనిక విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంక్ లతో నదిని దాటుతుండగా ఈ వరదలు సంభవించాయి. దీంతో నదిలో ఉధృతి పెరిగి టీ-72 ట్యాంక్ మునిగిపోయింది. అందులోని ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయారు. అప్రమత్తమైన సైన్యం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. జవాన్ల కోసం నదిలో గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది.

    దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు మృతి చెందినట్లు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. మృతుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారు. ప్రమాదంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related