- హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ

Supreme court : ఏపీలోని అమరావతి రైతులకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఆర్5 జోన్ పై గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అమరావతి రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు . అయితే హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో పాటు కేసు ను రాజధాని బెంచ్ కు బదిలీ చేసింది.. ఈ మేరకు సోమవారం సుప్రీం కోర్టులో ఈ విచారణ సాగింది. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
సుప్రీం లో ఏం జరిగిందంటే..
ఏపీలో రాజధాని ఆర్ 5 జోన్ లో పేదలకు ఇండ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే హైకోర్టు దీనికి ప్రభుత్వం వైపే మొగ్గు చూపింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు పై స్టే ఇచ్చేందుకు Supreme court నిరాకరించింది. ఇక రాజధాని బెంచ్ కు ఈ కేసును బదిలీ చేసింది. అక్కడే తేల్చుకోవాలని సూచించింది.
దాదాపు 1300 ఎకరాల్లో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. రాజధాని విషయంలో భూములు అభివద్ధి చేయడంతో మాస్టర్ ప్లాన్ ను కాదని రాష్ర్ట ప్రభుత్వం పేదలకు ఇచ్చేందుకు ముందుకెళ్తుండడంతో , రైతుల ఆవేదనకు కారణమైంది. అమరావతి అభివృద్ధిలో భాగంగానే పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టు వచ్చే శుక్రవారం ఓ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. తుది తీర్పు వస్తే ఓ క్లారిటీ రానున్నది.