34.7 C
India
Friday, April 10, 2026
More

    ఢిల్లీపై సుప్రీం కీలక తీర్పు.. సంబురాల్లో ఆప్ శ్రేణులు

    Date:

    key judgment Supreme court
    Supreme court

    key judgment on Delhi : దేశ రాజధాని ఢిల్లీపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇన్నాళ్లు లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ర్ట ప్రభుత్వ అధికారాలపై కొనసాగుతున్న వివాదానికి ఓ పులిస్టాప్ పడినట్లయ్యింది. ఈ తీర్పు కేంద్రానికి కూడా అతిపెద్ద షాక్ అని చెప్పవచ్చు. తీర్సు నేపథ్యంలో ఆప్ నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

    ఇంతకీ సుప్రీం ఏం చెప్పిందంటే..

    ఢిల్లీ దేశ రాజధాని. ఇన్నాళ్లు కేంద్రం హోంశాఖ ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడి పాలనలో తనదైన మార్క్ చూపేవారు. ఈ అంశంపై రాష్ర్ట ప్రభుత్వానితో కొన్ని సార్లు విభేదాలు ఎదురయ్యేవి. దీంతో సుప్రీంలో తేల్చుకునేందుకు ఇటు కేంద్రం, అటు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధమయ్యాయి. కాగా, సుప్రీం తీర్పునిస్తూ ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వానికే అంతిమ అధికారం ఉంటుందని వెల్లడించింది. లేకుంటే అధికారుల్లో జవాబుదారీతనం కొరవడుతుందని అందులో పేర్కొంది. ఢిల్లీని మిగతా రాష్ర్టాల మాదిరిగానే భావించాలని స్పష్టం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర అధికారాలను కొనసాగించడం సరికాదని పేర్కొంది. మొత్తానికి ఈ తీర్పు ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కు పెద్ద విజయమే అనుకోవచ్చు. కేంద్రం ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్లతో అనేక సందర్భాల్లో రాష్ర్ట ప్రభుత్వాలకు వివాదాలు ఏర్పడుతున్నాయి. అధికారం మాదంటే.. మాదని ఇద్దరూ విభేదాలకు తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు ఈ సమస్యకు ఇక చెక్ చెప్పినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

    ఢిల్లీపై పట్టు కోసం
    ఢిల్లీపై పట్టుకోసం బీజేపీ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నది. కేజీవ్రాల్ సర్కారును అనేక రకాలు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కూడా విమర్శలు వస్తున్నాయి. రాష్ర్ట సర్కారు తీసుకునే నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా అడ్డుకోవడం అనేక సందర్భాల్లో వివాదాలకు కారణమైంది. ఇక రాష్ర్ట ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయనే సుప్రీం తాజా తీర్పుతో ఇప్పటికైనా ఈ విభేదాలకు చెక్ పడుతుందని అంతా అనుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KA Paul : దేవరకొండ, బాలకృష్ణ, మంచు లక్ష్మి సహా 25 మందిపై సుప్రీంకోర్టుకు కేఏ పాల్

    KA Paul : బెట్టింగ్ వివాదంపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ...

    AAP : ఈసారి చీపురు పార్టీ ఢిల్లీలో గల్లంతేనా?

    AAP : దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ 70...

    Supreme Court : మొదటి భర్తతో విడాకులు తీసుకోకున్నా.. రెండో భర్త నుంచి భరణానికి భార్య అర్హురాలే : సుప్రీంకోర్టు

    Supreme Court ఫ తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన పిటిషనర్....

    By-Elections : తెలంగాణలో పది స్థానాలకు ఉప ఎన్నిక రానుందా..!

    By-Elections : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును నిన్న సుప్రీం కోర్టు...