TANA 2023 Celebrations : అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా నగరంలో తానా 2023 మహాసభలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన బ్యాంక్వెట్ విందుతో ఈ వేడుకలను ప్రారంభించారు. మూడురోజులపాటు తానా మహాసభలు జరుగనున్నాయి. ఈ వేడుకల కోసం భారత మాజీ ఉప-రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. నటసింహం నందమూరి బాలకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ వేడుకల్లో హాజరైన ముఖ్య అతిథులకు తానా ప్రతినిధులు, ప్రవాసీ భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి స్వాగతం పలికిన వారిలో Ublood ఛైర్మన్ యలమంచిలి జగదీష్.. గుంటూరు జడ్పీమాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం.. మన్నవ సుబ్బారావు తదితరులు ఉన్నారు.
తానా 2023 మహాసభల్లో భాగంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన పలువురికి పురస్కారాలను అందజేశారు. ఈ పురస్కారాలు అందుకున్నవారిలో జొన్నలగడ్డ సుధాకర్.. వేమూరు మూర్తి.. దీప్తి పిడికిటి స్మిత్.. మాలిని పులి.. కాటా వెంకటేశ్వరరావు.. డా.హెచ్.రాయుడు కోకా.. డా.ముసునూరి శంకర్.. డా.వేములపల్లి శ్రీనివాస్.. పాటిబండ శర్మ.. సత్య కునపల్లి.. యలమంచిలి బాబ్జీరావు.. డా.వేగేశ్న రాజు.. వంశీ కోరా.. అడ్లూరు శైలజ.. మల్లికా మద్దురి.. చిన్న వెంకటేశ్వరరావు.. మన్నే నాగేశ్వరరావు.. బెల్లంకొండ కిషోర్.. మాధవి సోలేటి.. శశికాంత్ వల్లెం తదితరులను ఉన్నారు. కళా.. సాంకేతిక.. సేవా.. వైద్య రంగాల్లో చేసిన సేవలను గుర్తిస్తూ వీరికి తానా పురస్కారాలను అందజేసినట్లు నిర్వాహాకులు తెలిపారు.
కాగా ఈ వేడులకలకు ముందు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్త ఎన్వీ రమణ.. సినీ నటుడు బాలకృష్ణలను తానా అధ్యక్షుడు అంజయ్య.. కన్వీనర్ పొట్లూరి రవి.. ఛైర్మన్ లావు శ్రీనివాస్‌ల నేతృత్వంలోని కార్యవర్గం ఘనంగా సన్మానించింది. అదేవిధంగా ఎమ్మెల్యే సీతక్క.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. వైసీపీ ఎంపీ రఘురామరాజు.. టీ.జీ.వెంకటేష్.. కనకమేడల.. పరిటాల శ్రీరాం.. మురళీమోహన్.. వసంత కృష్ణప్రసాద్ తదితరులను సత్కరించారు.
ఈ వేడుకల్లో నెల్లూరు జింక మాంసం.. దివిసీమ రొయ్యలపొట్టు.. పూతరేకులు వంటి వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్.. వేమన సతీష్.. పద్మశ్రీ, కోమటి జయరాం.. తదుపరి అధ్యక్షుడు నిరంజన్.. కార్యదర్శి సతీష్ వేమూరి.. కోశాధికారి కొల్లా అశోక్‌బాబు.. తానా ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ.. దిల్ రాజు.. హీరో నిఖిల్.. పాతూరి నాగభూషణం.. కామినేని శ్రీనివాస్.. నటుడు రాజేంద్రప్రసాద్.. అరుణా మిల్లర్ తదితరులు పాల్గొన్నారు.