ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు నగరంలో 10వేల మందికి సంక్రాంతి పండుగ కానుకులను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నేత మన్నవ మోహనకృష్ణ పంపెనీ చేశారు. సంక్రాంతి పండుగ కానుక కార్యక్రమం జరగకుండా నగర పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిషేధించి ఆంక్షలు విధించనప్పటికీ ఇంటింటికీ వెళ్లి ఈ కానుక అందజేశారు.
ఈ కానుకలో వివిధ రకాల నిత్యావసర వస్తువులు పొందుపరిచారు. దీనితో పాటు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు తన మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించామని, భవిష్యత్తులో కూడా చేస్తామని తెలిపారు. పండుగ రోజు పేద వారికి సహాయం చేయాలన్న ఉద్దేశంతో కార్యక్రమం చేపడితే దీనికి కూడా పోలీసులు అడుగుడుగునా ఆంక్షలు విధించడం ఏంటి అని మోహన కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమం చేస్తే ప్రభుత్వం చేయాలి లేక పోతే మరెరు చేయకూడదు అన్న చందంగా ఏపి లో రాజకీయం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి కచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు.