Group 4 Results Out : తెలంగాణలో గ్రూప్-4 రిజల్ట్స్ ను టీఎస్‌పీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఈమేరకు అభ్యర్థుల ర్యాంకుల జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచింది. గ్రూప్ 4 పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ర్యాంకులు చూసుకోవాలని కమిషన్ పేర్కొంది.
ధ్రువపత్రాల వెరిఫికేషన్‌కు ఎంపికైన వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని కమిషన్ సూచింంచింది. కాగా గత ఏడాది జూలైలో గ్రూప్-4 పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. తాజాగా ఫలితాలు విడుదల కావడంతో అభ్యర్థులు తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.
Check Group-4 Merit List : https://www.tspsc.gov.in/