21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Relief to Avinash : అవినాష్ కు తెలంగాణ హైకోర్టు ఊరట..

    Date:

    Relief to Avinash
    Relief to Avinash, Kadapa MP

    Relief to Avinash : వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో అవినాష్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజులపాటు వాదనలు విన్న జడ్జి బుధవారం తీర్పు వెలువరించారు. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేశారు అయితే షరతులు విధించారు.

    సీబీఐ కి అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరించాలని, ప్రతి శనివారం విచారణకు హాజరు అవ్వాలని సూచించారు. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీలులేదని ఆదేశించారు. రూ. 5 లక్షలతో రెండు పూచికత్తులు ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. ఒకవేళ అవినాష్ రెడ్డి సహకరించకపోతే సీబీఐ అధికారులు మళ్ళీ కోర్టును సంప్రదించవచ్చని పేర్కొన్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినా కోర్టును సంప్రదించవచ్చని తెలిపారు.

    కాగా వైయస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధించి వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు సీబీఐ చూపించినందునే హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసిందని సమాచారం. కాగా అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు పై ఆయన అనుచరులు  సంతోషం వ్యక్తం చేశారు. అయితే సీబీఐ అరెస్టు చేయనుందనే వార్తల నేపథ్యంలో అవినాష్ కు తెలంగాణ హైకోర్టు తీర్పు పెద్ద రిలీఫ్ అనుకోవచ్చు

    మరోవైపు హైకోర్టు తీర్పుపై  పలువురు న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేశారు. అవినాష్ కు ముందస్తు బెయిల్ ఇస్తే సిబిఐ విచారణకు ఆటంకం కలుగుతుందని విన్నవించినా, కోర్టు పట్టించుకోలేదని పేర్కొన్నారు. అయితే ఈ తీర్పుపై వైఎస్ వివేకా కూతురు సునీత ఎలా స్పందిస్తారని అంతా చర్చించుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    High Court : ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ బ్యాచ్‌కు హైకోర్టులో చుక్కెదురు – హరీష్ రావుకు ఊరట

    High Court : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

    TDP Female Leader : కడపలో జగన్, అవినాష్ ను కడిగిపారేసిన టీడీపీ మహిళా నేత

    TDP female leader : వైఎస్ఆర్ కడప జిల్లా సమీక్షా సమావేశంలో అరుదైన...

    Foreign Dogs : విదేశీ కుక్కల దిగుమతి నిషేధంపై హైకోర్టు స్టే

    Foreign Dogs : ప్రమాదకర 25 రకాల విదేశీ జాతి కుక్కల...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...