27.6 C
India
Sunday, October 13, 2024
More

    Terrible in Telangana: తెలంగాణలో దారుణం…. విద్యార్థిని జుట్టుపట్టి ఈడ్చిన కానిస్టేబుల్స్..!

    Date:

     

    తెలంగాణ రాష్ట్రంలో  దారుణం చోటు చేసుకుంది. ఏబీవీపీ కార్యకర్తను జుట్టు పట్టి ఈడ్చారు మహిళా కానిస్టేబుల్స్. స్కూటీపై వెళ్తూ.. పరుగెడుతున్న విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగారు. దాంతో ఆమె కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    హైదరాబాద్‌లోని వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు విద్యార్థులు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 55ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనలకు ఏబీవీపీ మద్ధతు ప్రకటించి, నిరసనలో పాల్గొంది. అయితే, నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు అతిగా ప్రవర్తించారు. శాంతియుతంగా చేస్తున్న నిరసనపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థిని పరుగెడుతుండగా.. వెనుక నుంచి స్కూటీపై వచ్చిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ ఆమె జుట్టు పట్టి లాగారు. దాంతో ఆమె కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. యువతి జుట్టుపట్టి లాగిన కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Amaravathi: ఏపీ పన్నుల చీఫ్ కమిషనర్ గా బాబు.ఎ

    Amaravathi: ఏపీ రాష్ట్ర పన్నుల చీప్ కమిసనర్ గా బాబు.ఎ నియమితులయ్యారు....

    CM Chandrababu: పండగల పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత: సీఎం చంద్రబాబు

    CM Chandrababu: పండగ పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సీఎం...

    Ratantata : ముమ్మాటికీ నువ్వు చేసింది తప్పే రతన్ టాటా

    Ratantata : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తీవ్ర అస్వస్థతతో 86...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related