31.8 C
India
Wednesday, September 16, 2026
More

    Matka: నా కెరీర్‌లో బెస్ట్ సినిమా ‘మట్కా’.. వరుణ్

    Date:


    Matka:‘నటనకి ఆస్కారం ఉన్న పాత్ర చేయాలని చూస్తున్న సమయంలోనే ‘మట్కా’ కథ వచ్చింది. ఇలాంటి కథ దొరకడం అదృష్టం.’ అని మట్కా గురించి వివరించారు వరుణ్‌తేజ్‌. కమర్షియల్‌ సినిమాగా కాకుండా ప్రయోగాత్మక కథతో ప్రయాణం చేస్తున్నానని నా వారు చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిని సంతృప్తిపరిచే చిత్రం. భారీ హంగులతో పాన్‌ ఇండియా చిత్రాలు.. పీరియాడిక్‌ చిత్రాల జోరు కొనసాగుతున్న సమయంలో ప్రేక్షకుల ముందు కొస్తున్న ఆ స్థాయి సినిమానే ‘మట్కా’. వరుణ్‌ హీరోగా, కరుణకుమార్‌ దర్శకత్వంలో రాబోతోంది. 14న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ..

    ప్రస్తుత జనరేషన్ లో కథల ఎంపిక చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ప్రేక్షకుల ఒపీనియన్ రోజు రోజుకు మారుతోంది. కథ నచ్చి ఏడాది పాటు దానిపై పని చేసి, సరైన తేదీ చూసుకొని విడుదల చేసేసరికి ఏడాదిన్నర పడుతుంది. ఆ రోజుకు ఆ కథ పాతదవుతుందా..? ఇక షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యే వరకు ప్రేక్షకుల నాడి ఎలా ఉంటుంది తెలుసుకోవడం కొంచెం కష్టం. అందుకే చిత్ర బృందం50 మంది కూర్చొని, కోట్ల మందిని లక్ష్యంగా చేసుకొని సినిమా కోసం రంగంలోకి దిగుతాం. ఇది కూడా ‘మట్కా’ లాంటి జూదమే (నవ్వుతూ) అందుకే సక్సెస్‌ రేటు తక్కువ. వేగంగా సినిమా చేయడం సరైందా లేదంటే.. ఆచితూచి చేయడం సరైందా అని జవాబు వెతుక్కునే పనిలో ఉంటాం మేమంతా.’

    కథ ఎంపికలో ప్రేరేపించిన అంశాలు..?
    వాసు పాత్రనే ప్రధాన కారణం. ఇది ప్రేక్షకులను కథా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. వాసు చెప్పేది కొన్ని సమయాల్లో నిజం అనిపిస్తుంది. కొన్ని సార్లు జాలి కలుగుతుంది, కోపం, ఆవేశం, ఇలా చాలా కోణాలు ఉన్నాయి. ‘ఈ దేశంలో చలామణి అయ్యే ప్రతీ రూపాయిలో 90 పైసలు ఒక్కడే సంపాదిస్తాడనే ఓ సంభాషణ ట్రైలర్‌లో వినిపిస్తుంది.’ ఆ ఒక్కడు తాను కావాలకుంటాడు వాసు.

    కరుణకుమార్‌ గత చిత్రాలలో కులవివక్షపై ప్రధానంగా ప్రస్తావించారు. ఇందులో అలాంటి అంశాలు ఉన్నాయా..?
    సమాజంలోని అంతరాల గురించి ప్రస్తావించే ప్రయత్నం చేశారు. సమాజం తనకి సాయం చేయడం లేదనే బాధ, కోపం వాసులో ప్రధానంగా కనిపిస్తుంది. అలాగని ఆ దారిలో వెళ్లాలి అని చెప్పడం లేదు. సందేశం కంటే బలమైన వాణిజ్యాంశాలతో రూపొందించిన చిత్రం.

    నటుడిగా సవాళ్లు..?
    ‘గద్దలకొండ గణేష్‌’ తర్వాత నా సినిమాల్లో నటన పరంగా పరిమితులు ఉండేవి. అవన్నీ కథా ప్రాధాన్యమున్న సినిమాలు కావడమే. కానీ ఈ మూవీకి ఆ పరిమితులేమీ లేవు. వాసు జీవిత పరిణామక్రమానికి తగ్గట్టు తెరపై కనిపిస్తుండాలి. వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు..? డబ్బు వచ్చాక ఎలా మారాడు..? తన మాట తీరు ఇలా చాలా అంశాలను దృష్టిలో ఉంచుకొని నటించాల్సి వచ్చింది. అలాగని భిన్నంగా కనిపించద్దు. జీవితంలో ఒకొక్క దశలో ఎలాంటి మార్పులు వస్తుంటాయో, అలాంటి చిన్న చిన్న మార్పులను పాత్రలో చూపిస్తూ నటించాల్సి వచ్చింది. నన్ను తెరపై చూస్తున్నప్పుడు వాసు అనే నమ్మాలి కానీ, వరుణ్‌ గుర్తుకు రావద్దు. ‘గద్దలకొండ గణేష్‌’ తర్వాత నన్ను గణేష్‌ అని పిలిచారు. నా పాత్రల్లో నన్ను ఇష్టపడడమే విజయం.

    గ్యాంగ్‌స్టర్‌ కథలు చాలానే వచ్చాయి..? ఇందులో వైవిధ్యం ఏంటి..?
    ఒక ఆటను కనిపెట్టిన గ్యాంగ్ స్టర్ స్టోరీ ఇది. హత్యలు, దోపిడీలు, కిడ్నప్ లు చేస్తూ భయపెట్టే గ్యాంగ్‌స్టర్‌ కథలకు ఇది భిన్నం. బర్మా దేశం నుంచి శరణార్థిగా వచ్చిన వాసు 1958 నుంచి 1982 వరకు అంచలంచెలుగా ఎలా ఎదిగాడనేది కీలకం. వాసు జీవిత కథ అన్నమాట. తనే మట్కా కింగ్‌ అని విశాఖపట్నం నేపథ్యంలో ఈ కథను మలిచారు. సెల్ ఫోన్ లేని కాలంలో మట్కా నెంబర్ ను దేశం మొత్తం ఎంత వేగంగా పంపించేవారో ఇందులో చూడచ్చు.

    రామోజీ ఫిల్మ్‌సిటీలో..
    కరుణకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా అన్నప్పుడు చాలా మంది షాక్‌ అయ్యారు. ఈ కథతో వచ్చినప్పుడు ఆయన విజన్‌ నాకు అర్థమైంది. సరైన టీమ్‌ కుదిరితే మరో స్థాయి సినిమా అవుతుందని నమ్మాం. ఆయన మనసులను తాకేలా బలంగా కథ చెప్పే తీరు నచ్చింది. ఆయనతో నేను సినిమా చేసేందుకు కారణం అదే. ఆయన ఆలోచన విన్నాక దీన్ని ఎంత బడ్జెట్‌లో తీయచ్చు? మా మార్కెట్‌ ఏంటి? అని లెక్కలేసుకొని రంగంలోకి దిగాం. ప్రతీ ఒక్కరూ కెరీర్‌లో ఏదో ఒక దశలో ఒక పెద్ద అడుగు వేయాలి. మా కెరీర్‌లో ఆ అడుగు ఇదే. 60, 70 దశకాలలో సాగే కథ కావడంతో రామోజీ ఫిల్మ్‌సిటీలో విశాఖ పూర్ణా మార్కెట్‌ సహా చాలా ప్రాంతాలను సెట్లువేసి పునః సృష్టించి చిత్రీకరణ చేశాం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Gandeevadhari Arjuna : వరుణ్ ‘గాండీవధారి అర్జున’ 3వ రోజు కలెక్షన్స్.. దారుణమైన నష్టాలు తప్పవా?

    Gandeevadhari Arjuna : మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో మెగా...

    Varuntej Movie OTT : ఆ ఓటీటీలోకే వరుణ్ తేజ్ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

    Varuntej Movie OTT : ఇండస్ట్రీలోకి మోగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.....

    Anchor Suma : వరుణ్, లావణ్యల మధ్య అనుమానాలు రాజేసిన యాంకర్ సుమ

    Anchor Suma : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు....