ఇదంతా పక్కన పెడితే ఇటీవల బిహార్ లో ఒక సంఘటన జరిగింది. ప్రస్తుతం నెట్టింట్లో అది వైరల్ గా మారింది. తన సోదరి కులాంతర వివాహం చేసుకుందని, ఇది తల్లిదండ్రులకు, బంధువులకు నచ్చలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె అన్న స్నేహితునితో కలిసి వచ్చి సోదరిని బైక్ పై బలవంతంగా తీసుకెళ్లాడు. దీంతో బిహార్ లో ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ గా మారింది. ఇది చట్టానికి సమాజానికి మంచిది కాదని కొందరు అంటుంటే మరికొందరు ఏకీభవిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బిహార్ రాష్ట్రంలోని, అరారియా జిల్లాకు చెందిన రూప, చోటు కుమార్ ఠాకుర్ ప్రేమించుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో యువతి కుటుంబం పెళ్లికి అంగీకరించలేదు. దీంతో కుటుంబ సభ్యులను ఎదురించి రూప జూన్ 2వ తేదీన చోటు కుమార్ ఠాకుర్ ను వివాహం చేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన యువతి సోదరుడు తన స్నేహితుడితో కలిసి యువతి అత్తారింటికి వచ్చాడు. తన సోదరిని సినీ ఫక్కీలో బైక్ పై తీసుకొని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. అయితే స్థానికులు ఈ ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.
ఈ ఘటనపై అబ్బాయి కుటుంబం వారు బథ్‌నాహా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. వారు యువతిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. రూప వాంగ్మూలం మేరకు నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పోలీస్ అధికారి కుస్రు సిరాజ్ తెలిపారు.
|
ReplyForward
|






