విజయవాడ నగరానికి మణిహారంలో భావిస్తున్న దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ రేపు ప్రారంభించబోతున్నారు .2021 డిసెంబర్ 21న శంకుస్థాపన చేశారు. జనవరి 19, 20 24 స్వరాజ్ మైదానంలో 81 అడుగుల పెడస్టల్ పై 125 అడుగుల కాంస్య విగ్రహం 206 అడుగుల మేర ఏర్పాటు కానుంది. సామాజిక న్యాయ మహా శిల్పం పేరుతో నిర్మించగా రూ 404 కోట్ల వ్యయంతో 18. 81 ఎకరాల్లో స్మృతి వనాన్ని తీర్చిదిద్దారు.
అంబేద్కర్ విగ్రహం దగ్గర ఫెడస్టల్ లో గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో 4 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 హాళ్లు ఉన్నాయి. ఒక దానిలో సినిమా హాలు, మిగతా వాటిలో ఆయన జీవిత చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంది. స్మృతి వనం గోడలపై స్వాతంత్ర సమరయోధుల, జాతీయ నేతల చిత్రపటాలు ఉన్నాయి. 120 మెట్రిక్ టన్నుల కాంస్యం, 400 మెట్రిక్ టన్నుల స్టీల్,2,200 మెట్రిక్ టన్నుల పింక్ ఇసుక రాయిని వాడారు.