
Girl pregnant : 17 ఏళ్ళకే బాలిక గర్భవతి కాగా పిండాన్ని వైద్యపరంగా రద్దు చేయాలని ఆమె తండ్రి గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టుల కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఆడపిల్లలకు 14 నుంచి15 ఏళ్ల వయసులోనే పెళ్లిళ్లు చేసేవారని పేర్కొన్నారు. ఇక 17 ఏళ్లకే తల్లులు అయ్యేవారని గుజరాత్ హైకోర్టు మౌఖికంగా వెల్లడించింది.
మైనర్ బాలిక ఏడు నెలల గర్భం తర్వాతే తండ్రికి చెప్పింది. బాలిక వయస్సు దృష్ట్యా బాలిక పిండాన్ని రద్దు చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. గర్భం యొక్క వైద్య రద్దు కోసం న్యాయవాది ఒత్తిడి చేయగా.. జస్టిస్ సమీర్ జె డేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “పాత కాలంలో అమ్మాయిలకు 14-15 సంవత్సరాలలోపు వివాహం మరియు 17 ఏళ్లలోపు సంతానం కలగడం సాధారణం. మీరు చదవరు, కానీ దీని కోసం ఒక్కసారి మనుస్మ్రుతిని’’ చదవండి అని సూచించడం గమనార్హం.






