33 C
India
Friday, April 26, 2024
More

    కుల వైషమ్యాలకు పెట్టింది పేరు… అందుకే అంబటి కెరీర్ ముగిసిందా..?

    Date:

    The name given to caste feuds... is that why Ambati's career is over?
    The name given to caste feuds… is that why Ambati’s career is over?
    ఇక్కడ ఏదైనా క్యాస్ట్ ఫ్యాక్టరే డిసైడ్ చేస్తుంది. రాజకీయాలు, సినిమాలకే పరిమితమనుకున్న ఈ కులజాడ్యం క్రీడారంగాన్ని తాకింది.  అయితే ఇది ఒక్క రాష్ర్టం వరకే ఆగిపోలేడు. మనోడు అయితే చాలు అనే స్థితికి దిగజారింది. టాలెంట్ ఉన్నా, లేకపోయినా అందలమెక్కిస్తున్నారు. తమ కులం వాడు కాదనే కారణంలో టాలెంట్ ఉన్నోళ్లను తొక్కేస్తున్నారు. ఆ కుల గజ్జిలో దేశ పరువు ప్రతిష్టలు మంట గలుస్తున్నా మనకేం పట్టదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  ఇందుకు అంబటి రాయుడు విషయం ఇప్పడు ప్రధానంగా చర్చకు వస్తున్నది.
    కెరీర్ కు మింగేసిన కులం
    అంబటి రాయుడు కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోవడానికి ప్రధాన కారణం కులం కార్డేనన్న చర్చ జరుగుతున్నది. ఏపీలో కమ్మ, రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఏ రంగామైన తమ వారికే ప్రాధాన్యం ఇస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.
    మంచి టాలెంట్ ఉన్నా అంబటి రాయుడు దేశవాళి క్రికెట్లో రాణిస్తున్న అంతర్జాతీయ మ్యాచ్ లకు ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం కులం కార్డేనన్న ఆరోపణలు ఇప్పుడు మరింత వెల్లువెత్తుతున్నాయి. అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్  ఏపీలోని కాపు కులానికి చెందిన రాయుడును ఇలాగే తొక్కేశాడని ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
    ఐపీఎల్ లో అంబటి రికార్డు..
     ఐపీఎల్‌ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని రికార్డును అంబటి రాయుడు సాధించాడు. ఐపీఎల్‌ టైటిల్‌ సాధించి క్రికెట్‌ కెరీర్‌ ముగించిన రాయుడు భారత తరఫున 55 వన్డేలు, ఆరు టీ20లు ఆడాడు. తుది జట్టులో శాశ్వత స్థానం దక్కించుకోలేకపోయాడు. 2019 ప్రపంచ కప్‌కు టీం ఎంపిక సమయంలో నాలుగో స్థానం గాలించిన బీసీసీఐకి రాయుడు సరైన ప్లేయర్ గా కనిపించాడు. అయితే ఇక్కడ కుల రాజకీయాల కారణంగా రాయుడు టీమిండియా తరఫున ప్రపంచకప్‌ ఆడే అవకాశం కోల్పోయాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు రాయుడు.
    పర్ఫెక్ట్ ప్లేయర్
    2018, సెప్టెంబరు నుంచి 2019 మార్చి వరకు టీమిండియాకు నాలుగో స్థానంలో పర్ఫెక్ట్ ప్లేయర్గా  రాయుడు ఒదిగిపోయాడు. 2018లో ఐపీఎల్‌లో 602 పలుగులు చేశాడు. ఆరు నెలల వ్యవధిలో 21 వన్డేలు ఆడి, సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలతో మొత్తం 639 పరుగులు చేశాడు.
    ఫామ్ లో ఉన్నా పక్కన పెట్టారు..
    అద్భుత ఫామ్‌.. అత్యద్భుత ఆటతీరుతో ఊపుమీద ఉన్న రాయుడిని ఇంగ్లండ్‌లో 2019లో జరిగిన ప్రపంచ కప్‌కు ఎంపిక చేయలేదు. తుది జట్టులో రాయుడిని తీసుకోలేదు. అతని  స్థానంలో కేఎల్‌.రాహుల్, ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను బీసీసీఐ ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపర్చింది. ఈ నిర్ణయం తప్పని వరల్డ్‌కప్‌లో వారి ఆట తీరుతో తేలిపోయింది.
    తప్పు బట్టిన కుంబ్లే..
    2019 వరల్డ్ కప్ప్ కు అంబటి రాయుడును ఎంపిక చేయకపోవడాన్ని బౌలింగ్‌ లెజెండ్, మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే తప్పు బట్టారు. అప్పటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రి ఆరు నెలలపాటు రాయుడిని సిద్ధం చేసినా ఫలితం లేకుండా పోయింది. తుది జట్టులో  ఎంపిక చేయకపోవడంతో మనస్తాపం చెందిన రాయుడు అంతర్జాతీయ కెరీర్‌కు అర్ధాంతరంగా ముగింపు పలికాడు. విజయ్‌ శంకర్‌ ఒక 3డి (3 డైమెన్షనల్‌) ప్లేయర్‌ అని నాటి చీఫ్‌ సెలెక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యతో రాయుడు మరింత హర్ట్‌ అయ్యాడు. ‘ప్రపంచ కప్‌ చూడటానికి కొత్త సెట్‌ 3డీ గ్లాసెస్‌ ఆర్డర్‌ చేశాను‘ అని వివాదాస్పద ట్వీట్‌ చేసి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు రాయుడు.
    కులజాఢ్యానికి  కెరీర్‌ బలి!
    ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కులజాఢ్యం ఏ స్థాయిలో దిగజారిందో చెప్పడానికి అంబటి కెరీర్ నిదర్శనం. ఈ కులజాఢ్యం రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా మరింత విస్తరించింది. చివరికి క్రీడారంగాన్ని వీడలేదు. ఏకంగా జాతీయ స్థాయి క్రికెట్‌ను శాసించే స్థాయికి ఎగబాకింది. దీని ఫలితమే– యంగ్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు కెరీర్‌ ముగింపు అనే ఆరోపణలు ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు,...

    Jagan Strength : జగన్ బలం ఇక అదేనా..జనాలు ఏమనుకుంటున్నారంటే..

    Jagan Strength : ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు,...

    Jagan Strength : జగన్ బలం ఇక అదేనా..జనాలు ఏమనుకుంటున్నారంటే..

    Jagan Strength : ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...