19.8 C
India
Sunday, February 25, 2024
More

    Phone Unlocked Breath: ఇక శ్వాస తోనే ఫోన్ అన్ లాక్!

    Date:

     

     

    చెన్నై: సాధారణంగా వేలిముద్రలు, కంటి పాప (ఐరిస్‌) ప్రతి మనిషికి వేర్వేరుగా ఉంటాయి. దాని ఆధా రంగా ఇప్పటికే అనేక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఉపయోగించుకొని వేలి ముద్ర, ఐరిస్‌ ద్వారా ఫోన్‌ అన్‌లాక్‌ చేస్తున్నాం. వీటికి బదులు ఇప్పుడు శ్వాసతోనే వాటిని అన్‌లాక్‌ చేసే దిశగా మద్రాస్‌ ఐఐటీలో పరిశోధక విద్యార్థి ముకేశ్‌ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ శ్వాస పరిజ్ఞానాన్ని ఆచరణాత్మక అప్లికేషన్‌లు గా అభివృద్ధి చేశాక, సెల్‌ ఫోన్‌ అన్‌లాక్‌ తో పాటు భద్రతాపరమైన కార్యకలాపాల కోసం ఉపయోగించ వచ్చని ఆయన చెప్పారు.
    ఈ సాంకేతికత వైద్యరంగం లోనూ ఉపయోగ పడుతందన్నారు.

    ‘‘ఒక వ్యక్తి ఊపిరి వదిలేటప్పుడు శ్వాసకోశం ద్వారా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వస్తుంది. ప్రతి మనిషికి ఆ శ్వాసకోశంలో తేడా ఉంటుంది. దీంతో గాలి వేగంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీని ఆధారంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తిని వేరు చేయడం సాధ్యమవుతుందని ఈ అధ్యయనం ద్వారా మేం చూపిం చాం. ఈ టెక్నాలజీని మరింత మెరుగుపరచడానికి మా వద్ద కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ సాంకేతి కతను వాడటానికి మానవుడు జీవించి ఉండటం అవసరం. కాబట్టి ఇది మనుగడకు రుజువుగానూ ఉపయోగపడుతుంది.

    శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఇన్‌హేలేషన్‌ థెరపీకీ ఇది సాయపడుతుంది. ఈ రుగ్మతలున్న వ్యక్తికి ఎంత మోతాదులో ఔషధాన్ని ఇవ్వాలో ముందే నిర్ణయించడానికీ ఉపయోగపడుతుంది’’ అని ఐఐటీ కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌, అప్లైడ్‌ మెకానిక్స్‌ విభాగాధిపతి మహేశ్‌ తెలిపారు.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related