YS Jagan: సోషల్ మీడియా విస్తృతం అయినప్పటి నుంచి వైరల్ రాయుళ్లు, మీమ్స్ క్రియేటర్లకు చేతినిండా పని దొరికినట్లయ్యింది. మీమ్స్ క్రియేటర్లే కాదు.. సాధారణ యూజర్స్ కూడా క్రియేటర్లుగా మారి వారి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాజకీయ నాయకులు, సెలబ్రెటీలపై ఇష్టం వచ్చిన మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వీరి ఆటవిడుపునకు ఏపీ మాజీ సీఎం జగన్ బలవుతున్నారు.
జగన్ ఓటమి పాలైనప్పటి నుంచి మీమ్స్ రాయుళ్లు, ఎల్లో మీడియా, జగన్ విధానాలతో బలైన వారు ఆయనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే, ఈ మీమ్స్, రీల్స్ కూడా బాగా వెరల్ అవుతున్నాయి. వీటిని నెటిజన్లు ఎక్కువగా లైకులు.., షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇలానే ఇటీవల ఒక మీమ్ వైరల్ గా మారింది. గతంలో తేజ సినిమా గుర్తుంది కదా..? అదేనండి ‘ఫ్యామిలీ సర్కర్’. ఇందులో ధర్మవరం కోటను ఆడుకునే సీన్ గుర్తుంది కదా.. ఇప్పటికీ అది బాగా నవ్వు తెప్పిస్తుంది. దీన్ని ఉదాహరణగా తీసుకొని మీమ్ క్రియేట్ చేశారు.
2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. విజయం సాధిస్తుందని అనుకున్న జగన్, ఫలితాలు రావడంతో బాగా భంగపడ్డారు. అయితే, ఈ 11 సీట్లు ఎలా వచ్చాయని చంద్రబాబు నాయుడు రాబిన్ శర్మను పిలిచి కనుక్కొని రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారట. దీనిపై తేజ సినిమాను యాడ్ చేసి క్రియేట్ చేసిన మీమ్ బాగా పాపులర్ అయ్యింది.