Deepika delivery date: దీపికా పదుకొనే తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ప్రస్తుతం బేబీ బంప్ తో ఉన్న ఆమెకు డెలివరీ డేట్ ను వైద్యులు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 2018 లో దీపికా పదుకొనె-రణ్ వీర్ సింగ్ వివాహం చేసుకున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తాను ప్రెగ్నెన్సీ అయ్యానని ఇన్ స్టా పోస్ట్ ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె తన మొదటి బిడ్డకు జన్మనిచ్చే తేదీని ఖరారు చేసింది. అయితే ఆమె ప్రసవం అండన్ లో కాకుండా ముంబై నగరంలోనే ఉంటుందని తెలుస్తోంది.
‘దీపికా – రణవీర్ తమ జీవితంలోని రాబోయే కొత్త అధ్యాయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వారి బిడ్డ కోసం స్థలాన్ని ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సెప్టెంబర్ 28న సౌత్ బాంబేలోని ఆసుపత్రిలో ఆమె శిశువుకు జన్మనిస్తుంది. ప్రస్తుతం, త్వరలో కాబోయే తల్లి తాను పని నుంచి తీసుకున్న ప్రతీ విరామంను ఆస్వాదిస్తోంది.
దీపిక మార్చి 2025 వరకు ప్రసూతి సెలవులో ఉండే అవకాశం ఉంది.
2025లో నటనను పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే కొన్ని నెలలు తన శిశువుకే ఎక్కువ టైం కేటాయించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ‘ఆమె ప్రసూతి సెలవు వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటుంది. ఆ తర్వాత, ఆమె అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, ప్రభాస్‌లతో కలిసి కల్కి సీక్వెల్ లో పాల్గొంటుంది.’ అని తెలుస్తోంది.
దీపిక చివరిగా నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తో కలిసి నటించింది. నవంబర్ 2024లో విడుదల కానున్న రోహిత్ శెట్టి సింగం ఎగైన్‌లో ఆమె త్వరలో రణ్‌వీర్ సింగ్, అనేక ఇతర నటులతో కలిసి కనిపించనుంది.