సంక్రాంతి పండుగ ను ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ జరుపుకోవడానికి పేద,ధనిక అన్న తారతమ్యం అస్సలు లేదు. ఉన్నావారు అయినా లేని వారు అయినా తమకు కలిగిన దానితో ఈ పండుగను జరుపుకుంటారు. సాధారణంగా పెద్దపెద్ద భవంతుల ముందు లేదా పచ్చని పల్లె ప్రాంతాల్లో ఇళ్లముందు వేసేముగ్గులను మనం ఇప్పటిన వరకు చూసిఉంటాము..కానీ స్లమ్ లో తమ గుడిసెల ముందు వేసే ముగ్గలను ఎవరూ చూసిఉండరు. ఓక్కసారి ఇలా చూడండి ఓ మహిళ స్లమ్ ఏరియాలో తన గుడిసె ముందు ఎంత చక్కగా ముగ్గు వేసిందో మీరు చూడండి. ఈ ముగ్గును చూస్తే ఇది కదా సంక్రాంతి పండుగ అని అనిపించక మానదు. సంక్రాంతి పండుగ రోజు ఓ మహిళ వేసిన ముగ్గు ఇప్పుడు వైరల్ అవుతుంది.