Inter students missing : ఆంధ్రప్రదేశ్ లో హత్యలు పెరుగుతున్నాయి. ఇటీవల పదో తరగతి చదివే విద్యార్థిని హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ ది కూడా హత్య, ఆత్మహత్య తేలడం లేదు. ఈ నేఫథ్యంలో విశాఖపట్నంలోని గాజువాకలో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల అదృశ్యం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ వారు ఏమయ్యారు? ఎటు వెళ్లారనేదే అంతుచిక్కని ప్రశ్న. ప్రభుత్వ నిర్వాకం వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇంటర్ రెండో సంవత్సరం చదివే పవన్, దిలీప్, బాబీ అనే విద్యార్థులు ఈనెల 24 నుంచి కనిపించకుండా పోయారు. ముగ్గురు ఒకే ద్విచక్ర వాహనంపై వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అప్పటి నుంచి వీరు ఇళ్లకు చేరలేదు. వీరి సమాచారం అందడం లేదు. అయితే వీరు ఎక్కడకు వెళ్లినట్లు? ఏమైనట్లు? వీరు క్షేమంగా ఉన్నారా? లేదా? అనేది సందేహమే.
రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితుల కారణంగా వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల ప్రాణాలు ఏమయ్యాయి? వారు ఎక్కడ దాగి ఉన్నారనే ఆందోళన పెరుగుతోంది. వీరి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. వారి సెల్ ఫోన్ ల ఆధారంగా విచారణ చేస్తున్నా ఫలితం రావడం లేదు.
విద్యార్థుల హత్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ముగ్గురు కనిపించకుండా పోవడం ఆందోళనకు తావిస్తోంది. వారికి ఏమై ఉంటుందని వారి కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఇద్దరిది గాజువాక కాగా ఒకరిది మాత్రం కె.కోటపాడుగా చెబుతున్నారు. వీరి అదృశ్యం మిస్టరీ ఎప్పటికి వీడుతుందో తెలియడం లేదు.