AP: తిరుమల తిరుపతి దేవస్థానం పంపిన లక్ష లడ్డూలు ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకు న్నా యి. ఇప్పటికే అయోధ్యలోని రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న గర్బా లయంలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యకు వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉచితంగా శ్రీవారి ప్రసాదాన్ని అందజేయాలని నిర్ణయం తీసుకుం ది. ఇందుకు తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానం ద్వారా ఈ లడ్డూలను శుక్రవారం సాయంత్రం తరలించింది. ఈ రోజు ఆ లడ్డూలు అయోధ్యకు చేరుకున్నాయని ఆయన ట్రస్ట్ తెలిపింది. సోమవారం దేశమంతా రామనామంతో మారుమ్రోగనున్న వేళ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది.