
Ts Inter Results 2023 : తెలంగాణ ఇంటర్ మీడియట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం (మే 9) రోజు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశారు. తల్లిదండ్రులు, పిల్లలు ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు.
విద్యా్ర్థులు తమ ఫలితాలు చూసుకునేందుకు ఇంటర్ నెట్ సెంటర్లు, ఫోన్లలో బిజీగా ఉన్నారు. విద్యార్థుల రిజల్ట్ ను అంశాల వారీగా ఇవ్వనున్నారు. ఏఏ సబ్జెక్టులో ఎన్ని మార్స్క్ సాధించారో విడుదల చేశారు. అయితే గత మార్చి లో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో రాష్ర్ట వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు. అయితే ఏపీతో పాటే తెలంగాణలో ఒకే సారి పరీక్షలు ముగిసినా ఫలితాలను మత్రం తెలంగాణ లేటుగా విడుదల చేసింది.
కొన్ని రోజులుగా విద్యార్థులు చాలా టెన్షన్ ఫీలయ్యారు. గతంలో ఇంటర్ పరీక్షల మూల్యాంఖనం విషయంలో గందరగోళం నెలకొనడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కొంచెం కలవరపడ్డారు. కానీ ఈ సారి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడంతో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు.
అయితే ఈ సంవత్సరం ఇటర్ మీడియట్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ కొనసాగాయి. ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షలు 4,82,501 మంది విద్యార్థులు, సెకండ్ ఇంటర్ పరీక్షలు 4,23,901 మంది విద్యార్థులతో మొత్తం 9.06 లక్షల మంది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. అయితే ఈ సారి కూడా ఉత్తీర్ణతా శాతం అమ్మాయిలదే ఎక్కువ అని తెలుస్తోంది.
ఈ కింది వెబ్ సైట్స్ లో మీ ఫలితాలు చూసుకోండి
వెబ్‌సైట్లు https://tsbie.cgg.gov.in/ ద్వారా లేదా http://www.manabadi.co.in/






