UBlood app Download : మనిషి ప్రాణం నిలువాలంటే ‘ఆక్సిజన్’ ఎంత అవసరమో.. రక్తం కూడా అంతే అవసరం. మనిషి శరీరంలోని ప్రతీ కణానికి గుండె రక్తాన్నినిరంతరం సరఫరా చేస్తుంటుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తన శరీరంలో సరిపడా రక్తం ఉండాలి. లేనట్లయితే అనారోగ్య సమస్య బారినపడి చివరికీ ప్రాణాలను సైతం కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్తాన్ని దానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణాదాతలు మారచ్చు. ఆక్సిడెంట్ లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు.. శస్త్ర చికిత్సలు.. గర్భిణీలకు ఆపరేషన్లు చేయాల్సిన సమయంలో రక్తం అవశ్యకత అనేది కీలకంగా మారుతుంది. ఇటువంటి సమయంలో రక్తం అందుబాటులో ఉంటే చాలా సమస్యలను నివారించవచ్చు. అదే రక్తం అందుబాటులో లేనట్లయితే చాలామంది ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంది.
ఒకప్పుడు భారతదేశంలో రక్తం దొరకకు చాలా మంది చనిపోయేవారు. ఈ సమస్యకు చెక్ పెట్టే ఆలోచనతో ప్రవాసీ భారతీయుడు.. తెలుగు ఎన్ఆర్ఐ డాక్టర్ జగదీశ్ యలమంచిలి గారు యూబ్లడ్ యాప్ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ఈ యాప్ రక్తదాతలను.. రక్తం కావాల్సిన వారిని కలిపింది. దీంతో రక్తం కావాల్సిన వారు తన దగ్గరలోని రక్తం డోనర్ల వివరాలను తెలుసుకొని వారిని సంప్రదించే అవకాశం లభిస్తుంది. దీని ద్వారా తక్కువ సమయంలో రక్తం కావాల్సిన వారిని రక్తం లభించనుంది.
రక్తం అందుబాటులోకి వచ్చే సమయం తక్కువ కావడం వల్ల రక్తం దొరకక చనిపోయే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. భారతదేశంలో ఇప్పుడు రక్తం దొరకక చనిపోతున్నారని వార్తలు సైతం చాలా తక్కువ కన్పిస్తున్నాయి. దీని వెనుక యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జగదీశ్ యలమంచిలి గారి కృషి ఎంతో ఉంది. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి.
కరోనా సమయంలోనూ డాక్టర్ జగదీశ్ గారు తనవంతు బాధ్యతను నిర్వర్తించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన సేవలు మున్ముందు ఇలానే వెయ్యి కాలాలపాటు సాగాలని ఆత్మీయులు.. స్నేహితులు.. అభిమానులు కోరుకుంటున్నారు.
Please Download UBlood App.. Life Save..!