హైదరాబాద్: నగరంలోని బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనను గురువా రం నాడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. పౌర విమానయానశాఖ ఆధ్వ ర్యంలో వైమా నిక ప్రదర్శన నాలుగు రోజుల పాటు సాగుతుంది.ఈ నెల 21వ తేదీ వరకు ఈ వైమానిక ప్రదర్శన నిర్వ హించనున్నారు. ఈ వైమానిక ప్రదర్శనలో 106 దేశాల నుండి 1500 మంది ప్రతినిధులు పాల్గొన్నా రు. భారీ విమానాలు, చార్టెడ్ ఫ్లైట్లు, చాపర్లు, హెలికాప్టర్లను ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శ నకు ఈ నెల 20, 21 తేదీల్లో సాధారణ సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు.
పౌర విమానయాన శాఖ ఇచ్చిన అనుమతి తో రెండు రెండు రోజుల పాటు సాధారణ ప్రజలు కూడా ఈ హేలికాప్టర్లను చూసే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు,యువకులు చూడాలి అనుకున్న వారు 20,21 తేధీల్లో చూడవచ్చు. చాలా మందికి చాపర్లను,హెలికాప్టర్లను దగ్గర నుంచి చూడాలి అని ఉంటుంది. అయితే హెలికాప్టర్ లో చాపర్ లో ప్రయాణించే వారికి మాత్రమే ఎయిర్ పోర్టుల్లో అనుమతి ఉంటుంది. దీంతో దగ్గర నుంచి చూడాలి అనుకున్న వారు చూడలేక నిరుత్సాహంతో ఉంటారు. అలాంటి వారికి ఇప్పుుడు సువర్ణ అవకాశం చూడనివారి చూసేయండి..