
UPSC CSE 2022 Result : ఆమె ఓ ఎస్పీ కూతురు. తనకెందుకులే కష్టం అనుకోలేదు. అనుకున్నది సాధించాలని తపన పడింది. అకుంఠిత దీక్షతో ముందుకు నడిచింది. ఏకంగా దేశంలోని అత్యంత ఉన్నత విలువలు కలిగిన ఉద్యోగం సంపాదించాలని కలలు కన్నది. వాటిని సాకారం చేసుకునేందుకు పూనుకుంది. పట్టుబట్టి మరీ చదివింది. చివరకు తన కల నెరవేర్చుకున్నది. దీంతో ప్రశంసల జడిలో మునుగుతోంది.
2022 సంవత్సరానికి గాను మంగళవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా మూడో ర్యాంకు సాధించింది. తండ్రి నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్నారు. సోదరుడు గత ఏడాది జాతీయ స్థాయి ఇంజినీరింగ్ పరీక్షల్లో 12వ ర్యాంకు సాధించి ఇటీవలే ఉద్యోగంలో చేరారు. ఇప్పుడు కూతురు ఉమాహారతి సైతం జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం గమనార్హం.
మూర్ఖులు ఏ పని ప్రారంభించరు.. మధ్యములు ప్రారంభించి వదిలేస్తారు.. ఉత్తములు మాత్రం సాధించేదాక వదిలిపెట్టరు అనే నానుడిని నిజం చేసింది. రాష్ర్టంలోని విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. భవిష్యత్ లో మన ప్రాంతానికి కలెక్టర్ గా రావాలని అందరు ఆశిస్తున్నారు.
మొత్తానికి ఉమాహారతి ఎందరికో స్ఫూర్తిగా నిలవనుంది. ఆమెను ఆదర్శంగా తీసుకుని చాలా మంది సివిల్స్ లో సత్తా చాటాలని చూస్తారు. ఇలా పదిమందికి మార్గదర్శిగా నిలిచే అవకాశం ఎంత మందికి వస్తుంది. ఆమెను అందరు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. సాధించిన విజయానికి సంతోషం వ్యక్తం చేస్తోంది.