
వీరసింహా రెడ్డిని కలిసిన వీరమల్లు. నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం వీరసింహా రెడ్డి. ఈ చిత్రం టాకీ పార్ట్ మొత్తం పూర్తి కాగా ఒక పాట బ్యాలెన్స్ గా ఉంది. దాంతో ఆ పాటను హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో సెట్ వేసి చిత్రీకరిస్తున్నారు. బాలయ్య – శ్రుతి హసన్ ల మధ్య ఈ పాట చిత్రీకరిస్తున్నారు. సరిగ్గా పాట చిత్రీకరిస్తున్న సమయంలోనే హరిహర వీటమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్ లోకి వచ్చాడు. దాంతో షూటింగ్ ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ ను సాదరంగా ఆహ్వానించాడు బాలయ్య. కొద్దిసేపు ముచ్చటించుకున్న తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్.
గతంలో ఇలాంటి అరుదైన సంఘటనలు జరిగేవి. పక్కపక్కనే పలువురు స్టార్ హీరోల షూటింగ్ లు జరుగుతుండేవి. దాంతో షాట్ గ్యాప్ లో లేదంటే లంచ్ సమయంలోనో లేదంటే సాయంత్రం సమయంలోనో కలుసుకునే వాళ్ళు…… సరదాగా కబుర్లు చెప్పుకొనే వాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి కల్చర్ లేకుండా పోయింది. పక్కపక్కనే షూటింగ్ లు జరుగుతున్నా కూడా పట్టించుకునే వాళ్ళు ఉండటం లేదు. అలాంటి సమయంలో బాలయ్య షూటింగ్ కు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విచ్చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఈ సంఘటన అటు బాలయ్య అభిమానులకను ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులను కూడా అలరించడం ఖాయం. గతకొంత కాలంగా నందమూరి – మెగా అభిమానుల మధ్య దూరం తగ్గి అభిమానం చోటు చేసుకుంటోంది. నిజంగా ఇది అభినంచతగ్గ విషయం అనే చెప్పాలి.
మరో విశేషం ఏంటంటే …….. పవన్ కళ్యాణ్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 27 న ఆ సెట్ లో పాల్గొననున్నాడు పవన్ . దాంతో నాలుగు రోజుల ముందుగానే బాలయ్య ను కలిసి చర్చించాడు పవన్ కళ్యాణ్. మొత్తానికి ఈ ఎపిసోడ్ కూడా ఓటీటీ ని బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే చాలు అభిమానులకు పూనకాలే కదా ….. బాలయ్య తో కలిసి పవన్ కళ్యాణ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఖాయం.