
Water Supply : నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు మంజీరా తాగునీటి ఫేజ్-2లో కలబూర్ నుంచి HYD వరకు ఉన్న 1500MM పైప్ లైన్కు పలుచోట్ల లీకేజీలు ఉండడంతో మరమ్మతుల కారణంగా అంతరాయం ఉంటుందన్నారు. మూసాపేట్, నిజాంపేట, KPHB, హైదర్నగర్, పటాన్చెరు, RCపురం, మియాపూర్, బీరంగూడ, అమీన్పూర్, బోరబండ తదితర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు.