
BipperJoy : అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపర్ జోయ్’ తుఫాను తీవ్ర రూపం దాల్చనుంది. గోవా.. ముంబాయికి పశ్చిమ నైరుతి దిశలో కేంద్రకృతమైన బిపర్ జోయ్ మరో 36 గంటల్లో తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను ఉత్తర దిశగా కదులుతుందని.. అరేబియా సముద్రంలో చేపల వేటకు రాబోయే రెండ్రోజులు మత్స్యకారులు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.






