Lalu Prasad Yadav: భారత్ ఆధ్యాత్మిక దేశం మాత్రమే కాదు.. ఆయుర్వేద దేశం కూడా.. ఇక్కడి నుంచే ఎన్నో దేశాలు ఆయుర్వేద వైద్యాన్ని తీసుకెళ్లాయి. ప్రకృతితో మమేకమైతే ఎన్నో వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చని ఉదాహరణలతో సహా ప్రపంచానికి చాటి చెప్పింది ఈ దేశం ఇక్కడ మొలిచే మొక్క కూడా భయానకమైన వ్యాధులను నివారిస్తుంది. వాటిని కనీసం దరిచేరనివ్వదని సూచించింది.
ఇప్పుడు అల్లోపతి బాగా పెరుగుతోంది కానీ కొన్ని తరాలకు ముందు అల్లోపతి ఇక్కడ అంత ప్రాచుర్యంలో లేదు. అల్లోపతి స్థానంలో ఆయుర్వేదమే ఎక్కువగా వాడే వారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అలవాట్లను ప్రకృతితో ముడిపెట్టేవారు. మన తాతలను చూస్తే ఉదయమే వేపపుల్లతో పళ్లు తోముకుంటారు. ఇది ఆయుర్వేదం చూపించిన చిట్కానే..
వేపపుల్లతో పళ్లుతోముకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పండ్ల మధ్య ఉన్న జర్మ్స్ నశిస్తాయి. వేప పుల్లలోని చేదును ఎంతో కొంత మింగుతాం కాబట్టి బాడీలోకి షుగర్ లెవల్ కూడా స్థిరంగా ఉంటుంది. ఇన్సులిన్ పనితనాన్ని తటస్త పరుస్తుంది. జార్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది ప్రయోజనాలు ఉన్నాయి..
ఇక్కడ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లలూ ప్రసాద్ యాదవ్ తో ఒకరు మాట్లాడారు. ఆయన వేప పుల్లతో పండ్లు తోముకుంటుంటే జరిగిన సంభాషణ ఇది. ఆయన కూడా దేశం పేరును ఇండియా కాదు భారత్ అంటూ చెప్పాడు. వీరి చర్చ ఆసక్తి కరంగా ఉంటుంది. ఓ లుక్కేద్దామా?