
మంచు మనోజ్ పెళ్లి రోజు నుండి కొత్త దంపతుల తిరుమల టూర్ వరకు మంచు ఫ్యామిలీతోనే కనపడుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పెళ్లిలో కనిపిస్తే… అందరిలాగే ఇన్విటేషన్ ఉందేమోనని అంతా అనుకున్నారు. కానీ మంచు మనోజ్- భూమా మౌనిక దంపతులు కర్నూల్ వెళ్లారు. భూమా కుటుంబానికి ఎస్వీ కుటుంబానికి బంధుత్వం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
కానీ మంచు మనోజ్ దంపతుల కర్నూల్ టూర్ లోనూ, వారి ఫ్యామిలీతో ఉన్న సందర్భంలోనూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారు. అంతేకాదు కొత్త దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోగా… వారితో పాటు రోహిత్ రెడ్డి కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
దీంతో… పైలెట్ రోహిత్ రెడ్డికి, మంచు మనోజ్ దంపతులకు ఏంటీ సంబంధం…? వారితో అంత సాన్నిహిత్యం ఉందా…? వారు రాయలసీమ… రోహిత్ రెడ్డి తెలంగాణ…పైగా రోహిత్ రెడ్డి మంచు మనోజ్ కుటుంబానికి దగ్గరా… లేక భూమా కుటుంబానికా…?
దీనిపై ఆరా తీయగా… మంచు మనోజ్, భూమా మౌనిక, పైలెట్ రోహిత్ రెడ్డి మంచి ఫ్రెండ్స్ అని తెలసింది. ఈ ముగ్గురు నంద్యాలలో కలిసే చదువుకున్నారని, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అనే విషయం వారి కుటుంబాల్లోనూ అందరికీ తెలుసు. అంతేకాదు భూమా మౌనిక విడాకులు తీసుకోవటం, ఇటు మంచు మనోజ్ కూడా తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాక వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. పైగా మంచు మనోజ్ కు ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో ఒకరైన పైలెట్ రోహిత్ రెడ్డి వీరి ప్రేమను పెళ్లి వరకు చేర్చారని వారి సన్నిహితుల నుండి తెలుస్తోంది. రెండు కుటుంబాల్లో ఈ పెళ్లి గురించి తనే మాట్లాడారని, మనోజ్ కొత్త జీవితానికి రోహిత్ దగ్గరుండి అంతా తానయ్యారు. అందుకే రోహిత్ రెడ్డి మనోజ్ దంపతుల వెంటే ఉన్నారు.
ఇటు కర్నూల్ లోనూ ఎస్వీ కుటుంబ సభ్యులకు మంచు మనోజ్ రోహిత్ రెడ్డిని పరిచయం చేశారని… ఇది ఫ్యూర్ గా ఫ్రెండ్ షిప్ అని తేలింది. రాజకీయాల్లో బిజీగా ఉండే రోహిత్… తన ఫ్రెండ్ కోసం ఫుల్ టైం ఇవ్వటం సూపర్ అంటున్నారు ఆయన అనుచరులు.