
Siddharth-Aditi Rao Hydari : కోవిడ్ సమయం నుంచి పలువురు యువ హీరోలు పెళ్లి బాటపడుతున్నారు. హీరో నితిన్, రానా, నిఖిల్, శర్వానంద్ వివాహబంధంలోకి అడుగు పెట్టగా, ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ఇప్పడు అదే బాటలో సౌత్, నార్త్ లో హీరోగా చేసిన సిద్దార్థ్, అదితిరావు హైదరీ కూడా ఓ ఇంటివారయ్యారు.హీరోయిన్ అదితి రావ్ హైదరీ, హీరో సిద్ధార్థ్ గత మార్చి 26న కేవలం కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరిగింది. అయితే వారు అప్పుడే పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని, కేవలం తమ కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తెలంగాణలోని శ్రీరంగపూర్‌లోని శ్రీ రంగనాయకస్వామి ఆలయ మండపంలో వారి నిశ్చితార్థం అత్యంత రహస్యంగా జరిగింది. నిశ్చితార్థానికి ఇవు వైపులా కుటుంబ సభ్యులు మాత్రమే హాజయ్యారు.
మూడేళ్ల క్రితం నుంచే రూమర్స్
అదితి, సిద్ధార్థ్ కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ గాసిప్స్ వచ్చాయి. అయితే వీరు వాటిని కొట్టిపారేయ లేదు. అలాగని ఖండించలేదు. మీడియా కథనాలను పట్టించుకోకుండా తమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు.
అదే ఆలయంలో వివాహం
సిద్ధార్థ్- అదితి రావ్ హైదరీ వివాహం సెప్టెంబర్ 16న వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల పురాతన రంగనాథస్వామి ఆలయంలో జరిగింది. ఇదే ఆలయంలో వీరి నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహ వేడుకలకు సంబంధించిన చిత్రాలను అదితి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తన అనుభూతులను వ్యక్తీకరిస్తూ ఓ కొటేషన్ ను కూడా జత చేసింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రం హాజరయ్యారు.