
Ts schools closed today : తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. సదుపాయాలు సరిగా ఉండటం లేదు. అరకొర సౌకర్యాలతో విద్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో సర్కారు ఇప్పటికైనా పట్టించుకోవాలని అంటున్నారు. విద్యావ్యవస్థ బలోపేతం కావాలంటే పాఠశాలల పరిస్థితులు మెరుగుపడాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యావ్యవస్థ మెరుగు కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణిస్తున్నారు.
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. లక్షల్లో ఫీజులు గుంజుతూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈమేరకు ఏబీవీపీ ఈనెల 26న పాఠశాలలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. స్కూళ్ల నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సర్కారు తీరుకు నిరసనగా ఉద్యమం చేపడుతోంది. ఇందులో భాగంగా నేడు నిరసన చేపడుతోంది.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో పోస్టులు భర్తీ చేయాలని ఏబీవీపీ కోరుతోంది. అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోనే పాఠశాలల బంద్ చేస్తున్నట్లు దీనికి అందరు సహకరించాలని కోరుతోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 15 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పిలుపునిచ్చింది. కార్పొరేట్ విద్యాసంస్థల ముక్కుకు తాడు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విద్యాసంవత్సరం 2023-24 లో 229 పనిదినాలున్నాయి. ప్రతి రోజు ఐదు నిమిషాలు యోగా, ధ్యానం చేయాలి. జనవరి లోపు పదోతరగతి సిలబస్ పూర్తి చేయాలి. వచ్చే మార్చిలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు, జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు. 1 నుంచి 9వ తరగతి వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు పరీక్షలు, ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.