India to Bharath:నేడు భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇండియా పేరు మార్పుపై చర్చ జరుగుతోందని మనకు తెలిసిందే. ఈ చర్చపై సోషల్ మీడియాలో కూడా హడావుడి మొదలైంది. దేశాల పేర్లను పలకడం చాతకాక కొంత మంది వాటి పేర్లు, వాటిలోని ఉనికినే మార్చేశారన్న ఒక వీడియో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇందులో చాలా దేశాల పేర్లను వారు మార్చిన విధానాన్ని వివరించారు.
ఉదాహరణకు ‘కెన్యా’ పేరు. ఆ దేశంలోని ఒక పర్వతం పేరును ఆ దేశానికి పెట్టారు. ఆ పర్వతం పేరు ‘కిరిన్యాగ’. పలకడం చాతకాని బ్రిటీష్ వ్యక్తి ‘కెన్యా’గా పలికాడు. దీంతో ఆ పేరే ఆ దేశానికి వచ్చింది. ఈ తప్పు పదాన్నే ఇప్పుడు ఆ దేశం మొత్తం ఉచ్చరిస్తుంది. ఇక ‘మెడగాస్కర్’ కూడా అంతే.. ప్రపంచంలోనే బ్యూటిఫుల్ దేశం మెడగాస్కర్. ఈ దేశాన్ని ఒకప్పుడు ‘మొగడిషు, సోమాలియా’గా ఉండేది. పలుకడం చాతకాని మార్కొపోలో దాన్ని ‘మెడగాస్కర్’గా మార్చాడు. ఇప్పుడు ఆ దేశం యావత్తు అదే పేరుతో పిలుస్తుంది.
భారత్ కు కూడా ఇండియా పేరు అలాగే వచ్చిందని ఒక వాదన ఉంది. అమెరికాను కనుగొన్న కొలంబస్ భారత్ కు వచ్చిన సమయంలో ఈ దేశాన్ని ఇండియాగా పిలిచాడు. అప్పటి నుంచి భారత్ ఇండియాగా మారిందన్న వాదనలు కూడా కొన్ని వినిపించాయి. పేరును తప్పుగా పలికితే అదే అసలు పేరుగా నిలిస్తే నిజంగా ఎంత బాధగా ఉంటుందో కదా.. ఆయా దేశాలు, ప్రాంతాలు వాటి పేర్లు మార్చుకుంటే మంచిదేనన్న వాదనలు కూడా ఉన్నాయి.