
YCP MLA Parthasarathy : నేడు టిడిపి అధినేత చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. నేడు హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో పార్థసారథి కలవనున్నారు. టీడీపీలో పార్థసారథి చేరిక అంశం ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబును పార్థసారథి కలవగా టీడీపీలోకి వెళ్తే ఏ నియోజ కవర్గం కేటాయిస్తారనే అంశంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
మొత్తం మీద అధికార వైసిపికి గడ్డు కాలమని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి పార్టీని అంటిపె ట్టుకొని ఉన్న సీనియర్ నేతలను వైసిపి పక్కన పెడుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఎమ్మెల్యే లంతా కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి టిడిపి అధినేత చంద్రబాబును కలవబోతున్నారు. పార్థసారధికి ఎక్కడ సీటు కేటాయిస్తారన్న అంశంపై ఈరోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్థసారథి బాటలోని మరి కొంతమంది వైసిపి ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం అందుతుంది.