Emergency Message : భారత ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ విభాగం సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపించిన సందేశం అందరిలో భయం కలిగిస్తోంది. ప్రభుత్వ పంపించే ఈ సందేశంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరి మొబైళ్లకు సందేశాలు వస్తుండటంతో ఇది ఎందుకు పంపిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. కానీ ఇటీవల కాలంలో అన్ని మోసపూరిత సందేశాలు వస్తుండటంతో ప్రజలు తొందరపాటుకు గురికావద్దని సూచిస్తోంది.
సాంకేతిక రంగం పెరుగుతుండటంతో మోసాలు కూడా అదే రేంజ్ లో విస్తరిస్తున్నాయి. అరిచితుల నుంచి వచ్చే మెసేజ్ లు, కాల్స్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. దీంతో మోసాలకు గురవుతున్నారు. మనకు వచ్చే ప్రమాదాల గురించి ముందే హెచ్చరికలు చేస్తోంది. అనవసర సందేశాలను పట్టించుకోవద్దు. దీనికోసం భారత ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగానే అప్రమత్తం చేస్తోంది.
భారత ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి సందేశం గురించి అయినా కంగారు పడాల్సిన పనిలేదు. ప్రజలకు కలిగే ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ప్రభుత్వం సాయం చేస్తుంది. సందేశాలు చూసి మోసపోవద్దు. ఏవో నజరానాలు అందిస్తామని చెప్పి మోసం చేసే వారున్నారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండకపోతే కష్టాలలో పడాల్సి వస్తుంది. డబ్బు కోల్పోవాల్సి వస్తుంది.
అపరిచితులకు మన వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. బ్యాంకు నుంచి ఫోన్ చేశామని పక్కదారి పట్టిస్తారు. తీరా చూస్తే మన డబ్బు మాయం అవుతుంది. ఈ క్రమంలో మనం మోసాలకు గురికాకుండా ఉండాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంటుంది. ఎటు వైపు నుంచి మోసకారులు వస్తారో తెలియదు. అందుకే భారత ప్రభుత్వం ప్రజలు మోసపోకుండా ఉండేందుకు ఇలాంటి సందేశాలు పంపిస్తోంది.