
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. ఏదొక రూపంలో గత కొన్ని రోజులుగా విషాదాలే వింటున్నాం. తాజాగా ప్రముఖ కమెడియన్ మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో షూటింగులకు వెళ్తూ షూటింగులలో పాల్గొంటూ ప్రమాదాలకు గురై కొంత మంది గాయపడుతుంటే మరికొంత మంది మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి వారి ఫ్యాన్స్ కు కుటుంబ సభ్యులకు విషాదాన్ని ఇస్తున్నారు.
మరి ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ హాస్య నటుడు షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురి అయ్యాడు. ఈ ప్రమాదంలో ఈయనకు తీవ్ర గాయాలు అవ్వడంతో మృతి చెందాడు.. మరి ఆ కమెడియన్ ఎవరు అంటే? సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యి యూట్యూబర్, కమెడియన్ గా తన ప్రతిభను చాటుకుని తక్కువ సమయంలోనే లక్షల మంది ఫాలోవర్స్ ను అందుకుని దూసుకెళ్తున్నాడు దేవరాజ్ పటేల్..
ఈయన దిల్ సే బురా లగ్తా హై అనే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యి అందరి చేత నవ్వులు పూయించిన దేవరాజ్ సోషల్ మీడియా వ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యాడు.. దీంతో ఈయనకు సినిమాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది..
ఈ క్రమంలోనే తాజాగా ఒక షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్తూ రోడ్డు మీద ప్రమాదానికి గురయ్యి మరణించగా ఈయన మరణ వార్త విన్న వారంతా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. దేవరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు.